నవతెలంగాణ – గంగాధర : భార్యాభర్తలు తగాదపడి ఇటీవల బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఇరువురిని కాపాడిన యువకున్ని గంగాధర జీపీ పాలక వర్గం ఘనంగా సన్మానించింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా చెందిన భార్యాభర్తలు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో కొడిమ్యాల మండలం నమిలికొండ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. అయితే కట్ల వినీత్ భార్యాభర్తలు బావిలో దూకిన విషయాన్ని గ్రహించి వెంటనే తను బావిలో దూకి ఇద్దరిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు రక్షించాడు. భార్య, భర్తలు తగాదపడి బావిలో దూకి ఆత్మాహత్యా యత్నం చేసిన విషయం జిల్లాలోనే కళకళ సృష్టించింది. ప్రాణాలకు తెగించి బావిలో దూకిన భార్య, భర్తలను బయటకు లాగి కాపాడిన కట్ల వినీత్ ను పలువురు అభినందించగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గంగాధర గ్రామ పంచాయతీ పక్షాన ఆ గ్రామ సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, పాలకవర్గ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.