
బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు కులాచారి దినేష్ కు మండల బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఇటీవల బీజేపీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షుని మార్పులో తీసుకున్న నిర్ణయం లోభాగంగా నూతన అధ్యక్షుడు రూరల్ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడైన రూరల్ ఇంచార్జ్ కు అవకాశం కల్పించడంతో జిల్లా అధ్యక్ష పదవి కులాచారీ దినేష్ కు దక్కిందని, ఆయన శుక్రవారం అధ్యక్షుని హోదాలో మొట్టమొదటి సారిగా ధర్పల్లి మండలకేంద్రానికి వచ్చిన సందర్బంగా మండల నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. రూరల్ నియోజక వర్గ ప్రజల ఆధరాభిమానాల వల్లే తాను ఈస్థాయికి రావడం జరిగిందని అన్నారు. బీజేపీలో పార్టీ కొరకు పనులు చేసిన వారికి పదవులు వస్తాయని ,ఎవ్వరు నిరుత్సాహపడొద్దని, మంచి పనులు చేసిన వారికి తప్పకుండ అధిష్టానం గుర్తిస్తుందని అన్నారు. తమ నాయకుడుకి వచ్చిన అధ్యక్ష పదవిపై మండల నాయకులు,కార్యకర్తలు సంతోషానికి అవధులు లేకుండా, తమ నాయకుని రాకతో అందరు కేకలు ,టపాసులు కాల్చి స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీలో తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపుతో పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమములో మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి,పాల్తి గంగాదాస్ గుప్తా,చీలుక మహేష్,కర్క గంగారెడ్డి,రాజేందర్ గౌడ్,జర్ర మహిపాల్,చెలిమెల నవీన్,రెడ్డి,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.