వేములవాడ కోర్టు ఇంచార్జ్ ఏజిపిగా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది పొత్తూరు అనిల్ కుమార్ ను నియమిస్తూ ఈనెల 5న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ఆధ్వర్యంలో ఇంచార్జ్ ఏజిపి పొత్తూరు అనిల్ కుమార్ ను బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, మాజీ అధ్యక్షులు వేముల సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు రేగుల దేవేందర్, గడ్డం సత్యనారాయణరెడ్డి, నక్క దివాకర్, బొడ్డు ప్రశాంత్ కుమార్, బొజ్జ మహేందర్, బొజ్జ నరేష్, గుజ్జే మనోహర్ ఉన్నారు.