కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కు ఘన సన్మానం 

A great honor to the Chairman of the Corporation, Bellaiah Naik– జిల్లా నాయకుడు సత్యపాల్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియముతులైన  తేజవాత్ బెల్లయ్య నాయక్ ను శాలువాతో ఘనంగా సత్కరించినట్లు వైస్ ఎంపీపీ జెల్ల  వెంకటేష్ డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ జిల్లా నాయకుడు నాయని సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిరవహించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక కష్టపడ్డ వారికి గుర్తింపు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ ప్రాంత వాసి బెల్లయ్య నాయక్ కి చైర్మన్ పదవి రావడం పట్ల హర్ష వ్యక్తం తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్  నెల్లికుదురు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తోపాటు కొంతమంది పాల్గొన్నారు.