నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని పలువురు ఘనంగా సన్మానించారు. ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా సేవల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మోర రాజును పద్మ నగర్ గ్రామానికి చెందిన ఆదర్శ క్లబ్ ఆధ్వర్యంలో, పద్మశాలి సేవా సంఘం పద్మనగర్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందించాలని వారు కోరారు.