గోమాత షెడ్డు నిర్మాణానికి సహకరించిన పెద్దలకు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో ఆంజనేయస్వామికి వదిలిన గోమాతల కోసం షెడ్డు నిర్మాణానికి సహకరించిన పరమ కృష్ణ సిద్దిపేట జనార్దన్ రెడ్డి, లకు సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు సిరివేని శంకర్, సర్పంచ్ బైండ్ల రాజుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. సోమవారం బలరాముడి ప్రాణ ప్రతిష్టాపన లో భాగంగా వారిని గ్రామ పెద్దలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. గోమాతలు షెడ్యూల్ లేక రోడ్లపైనే సంచరిస్తూ ఉండడంతో రామ ఆలయం ఆవరణలో గల స్థలంలో షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు……