బదిలీపై వెళ్లిన పిఆర్టియు ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం..

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం పిఆర్టియు ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి బదిలీపై ఎడపల్లి మండలం పోచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బదిలీ కావడంతో, పి ఆర్ టి ఓ మండల శాఖ, ఎంపీడీవో ఆధ్వర్యంలో శాలువాళ్ళ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం జరిపారు. గత 19 సంవత్సరాలుగా రెంజల్ మండలంలో తన సేవలను అందించి ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం కృషి చేసిన సాయిరెడ్డిని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హెచ్ .శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, నరసింహారెడ్డి, తాహెర్, గౌరవాధ్యక్షులు శంకర్ కృష్ణ, గులాం అహ్మద్, కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.