ముధోల్ మండలం లోని ఆష్ట గ్రామపంచాయతి కార్యదర్శి గాడేకర్ గంగాధర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం కార్యదర్శి కి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో శాశ్వత పంచాయతీ కార్యదర్శి లేనందువల్ల, ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామంలో సమస్యలు తలెత్తాయని, వర్షాకాలంలో పారిశుద్ధ్యం పనులు సకాలంలో చేపట్టాలని కోరారు. కార్యదర్శి గాడేకర్ గంగాధర్ మాట్లాడుతు అందరి సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుకన్య రమేష్, మాజీ ఎంపీటీసీ సునీత పోషేట్టి,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.