రెంజల్ మండల సర్పంచ్లకు ఘన సన్మానం…

నవతెలంగాణ- రెంజల్

సర్పంచుల పదవీకాలం ఈనెలాఖరులోపు పూర్తి కావడంతో ముందస్తుగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం ఎంపీపీ రజినీకిషోర్, మండల కార్యాలయం అధికారులు సర్పంచ్లను ఘనంగా సన్మానం జరిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజని కిషోర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు నానా అవస్థలు ఎదుర్కొంటూ అభివృద్ధి పనులు చేశారని, వారి పెండింగ్ బిల్లుల విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె అన్నారు. గౌరవ సర్పంచులు తమ సొంత ఇంటి లాగా గ్రామాన్ని తీర్చిదిద్దారని ఆమె అభినందించారు. పదవి విరమణ అనంతరం వారికి రావలసిన డబ్బుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, పంచాయతీరాజ్ వినయ్ కుమార్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపర్డెంట్ శ్రీనివాస్, గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.