కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే గొప్ప మనిషి అవుతాడు

నవతెలంగాణ –  తిరుమలగిరి
జీవితం చాలా విలువైనది. మనిషికి అనేక కష్టాలు వస్తాయి,బాధలు వస్తాయి వాటిని ఎదుర్కొని మానవ జీవితాన్ని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ సాగిన వాడే గొప్ప మనిషి అవుతాడు అని జిల్లా ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరబోయిన లింగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు, హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్నారన్నారు. అందుకు ప్రధానంగా విలాస వంతమైన జీవితానికి అలవాటు పడడం అందుకు సరిపడా సంపాదన లేకపోవడం, ప్రతి చిన్న సమస్యకు ఒత్తిడికి లోను కావడం ఎదుర్కొనే శక్తి లేకపోవడం,చెడు అలవాట్లకు, డ్రగ్స్ ఆల్కహాల్ కు బానిసలై ఏమి చేయాలో తెలియక ఆత్మహత్య శరణం అనుకోవడం, చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, సమాజంలో చిన్న ఉద్యోగం చేయడం గిల్టుగా ఫీల్ అవ్వడం మరణించడం. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం పెద్దలకు చెప్పకపోవడం, చెప్పి ఒప్పించకపోవడం వారు అందుకు అంగీకరించకపోవడం ప్రేమ విచ్చీనం కావడం వారు మరణించడం.మరి కొంతమంది పై విషయాలకు బానిసలై చదువులో రాణించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.యువకుల్లారా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉంటారు ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం ఉంటుంది . పై విషయాలన్నిటినీ తట్టుకోండి ఎదిరించండి ముందుకు సాగండి మహనీయుల పుస్తకాలు చదవండి ఒక అంబేద్కర్ పుస్తకం చదవండి ఒక అబ్దుల్ కలాం జీవితం చదవండి స్వామి వివేకానంద ను చూడండి మీకు నచ్చిన మహావీరుల పుస్తకాలు చదవండి వారి జీవితం ఆదర్శంగా తీసుకోని మీరు కన్న కలలు సహకారం చేసుకోండి.