
మండల కేంద్రమైన ముధోల్ లోని పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఇటీవలే బాధ్యతలను చేపట్టిన ఎస్సైసంజీవ్ కుమార్ ను సోమవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్యల పరిష్కారం కోసం పోలిస్ సేవలు అవసరం అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయ పరంగా కృషి చేయాలని ఎస్సైని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కోరి పోతన్న, పి ఏ సి ఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, నాయకులు తాటెవార్ రమేష్, బత్తినోళ్ల సాయి,సాయినాథ్, లవన్, గంగప్రసాద్, శంకర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.