అంబేద్కర్ నగర్ పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం జరిపినట్లు గ్రామ కార్యదర్శి సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రజిని కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సర్పంచి మధురాబాయితోపాటు పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన ఈ గ్రామం అనేక సమస్యలు ఉన్నప్పటికీ పాలకవర్గ సభ్యులతో కలిసి అభివృద్ధి పథంలో తీసుకురావడం ఆనంద దయకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూసా, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.