మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా అలయన్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జిల్లా 258 రీజినల్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్, కోశాధికారి తోడేటి మురళి గౌడ్, పి ఆర్ ఓ కందుల సతీష్, ఉపాధ్యక్షులు బైరి చంద్రమౌళి, కందుల సతీష్, బొల్లం మల్లేశం, తోడేటి సతీష్ గౌడ్, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.