కమలాపూర్ పాలకవర్గానికి ఘనంగా సన్మానం

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని కమలాపూర్ పాలకవర్గానికి, జీపీ సిబ్బంది కార్మికులకు, అంగన్వాడీ, ఆశాలకు ఎంపీటీసీ జనార్ధన్ మరియు గ్రామ పెద్దలు బుధవారం ఘనంగా సన్మానించారు. పాలకవర్గం ఆఖరి రోజు కావడంతో సర్పంచ్ సూరవ్వ బాబు, ఉపసర్పంచ్ రమేష్ రెడ్డి లతో పాటు పాలకవర్గానికి గత ఐదు సంవత్సరాలుగా సేవ చేసినందుకు గౌరవప్రదంగా సన్మానించడం జరిగిందని ఎంపీటీసీ జనార్ధన్ అన్నారు. అలాగే గత ఐదు సంవత్సరాలుగా తమకు అన్ని విధాలుగా సహకరించిన పంచాయతీ కార్మికులు, సిబ్బంది మరియు అంగన్వాడి, ఆశాలు, లైన్మెన్ ను పాలకవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.