
అశ్వారావుపేట (వినాయకపురం)ఆరోగ్య కేంద్రం పరిధిలోని ,అశ్వారావుపేట రూరల్ ఉప కేంద్రంలో ఎం.పి.హే చ్.ఎ( ఫిమేల్ )గా పనిచేస్తున్న బి.వెంకటరమణ కు ఖమ్మం జిల్లా కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ జరిగింది. గత పదహారు సంవత్సారాలు గా అశ్వారావుపేట లోనే పనిచేస్తూ,బదిలీ పై వెల్తున్న ఆమెకు రూరల్ కేంద్రం పరిధిలోని ఆశా కార్య కర్తలు పూల మాలలు, బోకేలతో, శాలువా తో ఘనంగా సన్మానించారు.ఇంతకాలం ఓ కుటుంబ సభ్యులు గా కలిసి మెలసి పనిచేసామని,సిస్టర్ గారి బదిలీ బాధగా ఉందని పలువురు ఆశాలు బాధ వ్యక్తం చేశారు.పనిచేసిన కాలంలో ప్రజలతో మమేకమై,కలిసిమెలిసి ఉన్నారని,ఏ చిన్న సమస్యకైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారని బి.సి కాలని అంగన్వాడి టీచర్ కనక దుర్గమ్మ,నందమూరి కాలనీ అంగన్వాడి టీచర్ విజయ లక్ష్మి అన్నారు.వైద్యాధికారి మరియు అధికారుల సహాయ సహకారం,ఆశాలు, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్, ఎం.ఎల్.ఎచ్.పి ఉషా అందించిన సహకారం తోనే తాను అనుకున్న లక్ష్యాలను సాధించానని,వీరి సహకారం ఎప్పటికీ మరువ లేనని,వీరి అందరి సహకారం తో రూరల్ ఉప కేంద్రానికి మంచి పేరు వచ్చిందని,సన్మాన గ్రహీత వెంకటరమణ అన్నారు.