వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి

నవతెలంగాణ-సిరిసిల్ల రూరల్‌:
తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రాష్ట్ర పవర్‌ లూం, టెక్స్‌ టైల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళా, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, ఆర్డీఓలు, ఆనంద్‌ కుమార్‌, మధుసూదన్‌ జిల్లా రజక సంఘాల నాయకులు వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు. నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు.నాటి వారి స్పూర్తి తెలంగాణ సాధనలోనూ అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పష్టం చేశారు. రాష్ట్ర పవర్‌ లూం, టెక్స్‌ టైల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా ప్రభుత్వం ఆమె జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, రజక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్‌ కార్యాలయములో
సిరిసిల్ల రూరల్‌: చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి ఎస్పీ అఖిల్‌ మహజన్‌ మంగళవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, టౌన్‌ సి.ఐ ఉపేందర్‌, ఆర్‌.ఐ యాదగిరి,కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
17వ పోలీస్‌ బెటాలియన్‌లో..
సిరిసిల్ల రూరల్‌:తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయమని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ యస్‌.శ్రీనివాస రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకలను సర్దాపూర్‌ లోని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ యస్‌.శ్రీనివాస రావు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎ.జయప్రకాశ్‌ నారాయణ ,అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బి.శైలజ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
ముస్తాబాద్‌: చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ, జయంతి వేడుకలు.మండల కేంద్రంలో పాటు పలు గ్రామాలలో రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ సుమతీ కష్ణమూర్తి, ప్రజా ప్రతినిధులు చాకలి ఐలమ్మకు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆవునూరు గ్రామంలో రజక సంఘం గ్రామ శాఖ ఆద్వర్యంలో గ్రామస్థులు కలిసి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్‌ రావు జడ్పీటీసీ నరసయ్య, విద్యుత్‌ సహకార సంఘం డైరెక్టర్‌ అంజిరెడ్డి మాజీ డైరెక్టర్‌ విజయ రామారావు, రజక మండల సంఘం అధ్యక్షులు నారాయణ, నక్క దాసరి రవి, రజక సంఘం నాయకులు యాదగిరి, భాను, హనుమయ్య, నరసయ్య, దేవయ్య, బాలయ్యతో పాటు వీర గ్రామాల రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ అని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వేణు పేర్కొన్నారు. మంగళవారం జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కు మల్లయ్య, కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహరెడ్డి, దమ్మని లక్ష్మీ, లక్ష్మన్‌, ఉడుతల వెంకన్న, మండల ఉపసర్పంచుల ఫోరమ్‌ అధ్యక్షుడు సాదుల్‌, రజక సంఘం జిల్లా ఉపాద్యక్షుడు తెలంగాణ శ్రీనివాస్‌, నాయకులు రఘు, ర్యాగటి రమేష్‌, ఎడ్ల ప్రశాంత్‌ రెడ్డి, చొప్పరి అంజయ్య, నాంపల్లి నూతన్‌, దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి: చాకలి అయిలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రంగి:రుద్రంగి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షులు పోసు తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కట్కూరి శంకర్‌. వేములవాడ నియోజకవర్గ కో కన్వీనర్‌ అనిల్‌ కుమార్‌, నాయకులు కట్కూరి రమేష్‌, దయ్యాల ఉదరు, మండల ప్రధాన కార్యదర్శి దేశవేని భూమేష్‌, వేములవాడ నాయకులు కాదాస్‌ మహేందర్‌, నాయకులు తర్రె గణేష్‌, కాదసు అనిల్‌, లింగాల రవి, లింగాల పాల్గొన్నారు
ఎల్లారెడ్డిపేట:ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలు ఐలమ్మ విగ్రహనికి పూలమాలలు వేసి ఆమె చేసిన పోరాటాల గురించి వివరించారు. ఆనాటి కాలంలోనే ప్రజలకోసం పోరాటం చేసిన గొప్ప వీరవనిత అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం కార్యదర్శి బాలమల్లు, మండల రజక సంఘం గౌరవ సలహదారులు దొమ్మాటి నర్సయ్య, నాయకులు అజరు, రాజు, చంద్రయ్య, భాస్కర్‌లు పాల్గొన్నారు.