పది పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృదం 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సెంటర్ ను రెండో రోజు మంగళవారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సందర్శించారు. పది పబ్లిక్ పరీక్షల కేంద్రంలో నిర్వాహణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అధికారులు నిశితంగా పరిశీలించారు. రెండోరోజు సైతం హిందీ పరీక్ష ప్రశాంతంగా జరగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించిన నియమనిబంధనలు ఎగ్జామ్స్ సెంటర్ లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు తప్పక పాటించాలని జిల్లా బృందం సూచించింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ ఆదేశాల మేరకు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హెడ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణమూర్తి బందోబస్తు పకడ్బందీగా నిర్వహించారు.