మల్లన్నసాగర్ ను సందర్శించిన కర్ణాటక ఎమ్మేల్యేల బృందం

– విజిట్ టు ప్రాజెక్ట్ లో భాగంగా ఆర్థికశాఖ నిపుణుల కమిటీ పర్యటన
– ఎమ్మేల్యేలకు ప్రాజెక్టు వివరాలు తెలిపిన ఈఎన్సి హరిరామ్
నవతెలంగాణ – తొగుట
విజిట్ టు ప్రాజెక్ట్ లో భాగంగా ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ నిపుణుల కమిటీ పర్యటించారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్థిక శాఖ నిపుణుల కమిటీ పర్యటన సభ్యులైన 12 మంది ఎమ్మేల్యేలు మండలంలోని తుక్కాపూర్ గ్రామ సమీపంలోని గల మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎమ్మేల్యేల బృందానికి ఈఎన్సి హరి రామ్ ప్రాజెక్టు కట్టడం మొదలు నుండి ప్రాజెక్టు లో జరిగిన వివిధ దశలలో పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్ట్ టు ప్రాజెక్ట్స్‌లో భాగంగా,ఎమ్మెల్యేలు తొలుత సిద్దిపేట లోని రంగనాయకసాగర్‌ అనంతరం మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా అభివృద్ధి చేసిన వ్యవసాయం,  తాగునీటి వ్యవస్థ కోసం తెలంగాణలో లబ్ధి పొంది న ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం లో బాగంగా వివిధ భాగాలను వివరిం చామన్నారు. చైన్ ఆఫ్ ట్యాంకుల వ్యవస్థ కింద మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపేందుకు, ఆ నీటిని వినియోగం కోసం ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక, రూపకల్పనతో పాటు పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో అవలంబించిన నిర్మాణ చేపట్టినట్లు చెప్పారు. నిర్మాణం పద్దతితో పాటు పని యొక్క ప్రతి దశలో వివిధ ఇతర విభాగాల ప్రమేయం గురించి బృం దం సభ్యుల ఆసక్తిగా విన్నారని పేర్కొన్నారు. ఎమ్మేల్యే ల వెంట ఎస్‌ఈ బస్వరాజ్‌, ఈఈ సాయి బాబు, వెంకటేశ్వర్‌రావు, ఇంజినీర్లు, తదితరులు ఉన్నారు.