వనదేవతలను దర్శించుకున్న పంచాయతీరాజ్ అధికారుల బృందం

– వనదేవతలకు ప్రత్యేక ముక్కలు
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ వనదేవతలను  పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ వి ఎస్ ఎన్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ పి రవీందర్, అడిషనల్ కమిషనర్ ప్రదీప్ శెట్టి, డిప్యూటీ కమిషనర్ వెస్లీ, డిప్యూటీ కమిషనర్ రామారావు, డీఎఫ్ఓ రాహుల్, సీఈవో ప్రసన్న రాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య పంచాయతీ రాజ్ అధికారుల బృందం ఆదివారం స్థానిక ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అధ్యక్షతన దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. వీరికి పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు శాలువాలు కప్పి అమ్మవారి ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం మహాభాగ్యంగా ఉందని అన్నారు. వారి వెంట స్థానిక పంచాయతీరాజ్ అధికారులు ఎం పి ఓ శ్రీధర్, మేడారం పంచాయతీ సెక్రెటరీ కొర్నెబెల్లి సతీష్, ప్రోటోకాల్ అధికారి బొప్ప సమ్మయ్య తదితరులు ఉన్నారు.