నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురి సభ్యుల బృందం సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గాలి ద్వారా ప్రభలే వ్యాధుల గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి బృందం (assement టీం ) వచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రి సురింటెండెంట్ ప్రతిమారాజ్ ని కలిసి టిబి వార్డ్, ల్యాబ్, బ్రోంకస్కోప్,ఓపి విభాగాలవద్ద ఎయిర్ బోన్ ఇంఫెక్షన్ కంట్రోల్ మార్గదర్శకాల ప్రకారం పాటించవలిసిన పద్ధతుల గురించి చర్చించారు. అనంతరం ప్రతీ విభాగాన్ని తనిఖీ చేస్తూ ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి శానిటేషన్ వర్కర్స్ ని ఆరాతీశారు. ఈ బృందం లో డాక్టర్ భరత్, పార్థసారధి, జావీద్,డాక్టర్ ప్రమోద్ రెడ్డి, హెచ్ ఓ డి డాక్టర్ డి వి వి రావు, డాక్టర్ ఉదయ్ కృష్ణ, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవి, రమ్య పాల్గొన్నారు.