నవతెలంగాణ – పెద్దవూర
దిన దిన ప్రవర్ధమానంగా సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్టం లో ఉన్నత స్థానం లో ఉందని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యరమాద కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు వికాస సమితి 2016 లో రిజిస్టర్ చెయ్యడం జరిగిందని, ఈ సమితిలో లోప్రముఖులు, అనుభవజ్ఞులు, ఆర్టిడీ ఉద్యోగులు, జర్నలిస్టులు, కూడా సభ్యులు గా చేరారని తెలిపారు. వారందరు సలహాలు, సూచనలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే న్యాయ వాదులు, వివిధ పార్టీల నాయకులు వివిధ సంఘాల వ్యవస్థాపకులు,వ్యాపారులు ముఖ్య హోదాల్లో వున్నవారుకూడా సమాచార హక్కు చట్టం లో సభ్యులు గా చేరి వారు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. దాంతో దినదిన ప్రవర్ధమనంగా ఇప్పుడు సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల్లో కమిటీలు కలిగి ఉన్నత స్థానంలో వున్నదని అన్నారు. సమాచార హక్కు సమితిలో అన్ని జిల్లాల నుండి సభ్యులు చేరాలని అందరికీ ఇదే మా ఆహ్వానం అని కోరారు. మీ సమస్య ఏదైనా పరిష్కారానికి సలహాలు ప్రముఖులతో ఇప్పించబడునని తెలిపారు.