అనారోగ్యంతో బాధపడుతూ చేనేత కూలి మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణ కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన స్వర్గం బాలయ్య (59) చేనేత పనిలో ఉపాధి లేకపోవడంతో పలు షాపులు, హోటల్లలో దినసరి కూలిగా పని చేశాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూన్నారు.ఈ క్రమంలో గురువారం ఉదయం మరణించడంతో అంత్యక్రియల కోసం పలువురు దాతలు,సమాజ్ సుధార్ సమితి సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందించారు.మృతునికి భార్య,కొడుకు ఉన్నారు. దాతలు మానవతా దృక్పథంతో బాలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య కోరారు.