రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం వారు నిర్వహించిన కాన్ఫరెన్స్ అవార్డుల మహోత్సవం శంకరాభరణం కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రోటరీ క్లబ్స్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులలో ఉత్తమ అధ్యక్షులుగా పట్వారి గోపికృష్ణ ఫస్ట్ ప్రైజ్, కార్యదర్శులలో పట్వారీ తులసి సెకండ్ ప్రైజ్, ఆర్మూర్లో చేసిన పర్యావరణం, ఆరోగ్య శిబిరాలు, సామాజిక రంగం, విద్యారంగం ఇలా వివిధ అంశాలపై చేసిన కృషికి ఉత్తమ అవార్డ్స్ ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ గవర్నర్ బుషిరెడ్డి శంకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ.. మేము చేసిన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు అని, మాకు ఈ సంవత్సరం సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్, నిజమాబాద్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్, రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు విజయ్ కాంత్, తదితరులు పాల్గొన్నారు.