వలస కుటుంబం చేసిన పోరాటానికి ఆస్కార్‌ అవార్డుల పంట

– రెండు ఆస్కార్లతో భారత్‌ విజయకేతనం
‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. డేనియల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మిషెల్‌ యో, కి హుయ్‌ క్వాన్‌, జామీ లీ కర్టిస్‌ వంటి హేమాహేమీలతో ఇది రూపుదిద్దుకుంది. ఎవిలిన్‌ క్వాడ్‌ అనే చైనీస్‌ వలసదారుల కుటుంబం అమెరికాలో లాండ్రీ షాపు రన్‌ చేస్తుంటుంది. అనుకోకుండా ఓ రోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది?, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లు పొందిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం సహా ఆరు అవార్డులను కైవసం చేసుకుని విజయ కేతనాన్ని ఎగురవేసింది. నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ కైవసం చేసుకోవాలని. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసింది. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. థ్యాంక్యూ కార్తికేయ. ఇలానే మరిన్ని చిత్రాలు చేసి ఇలాంటి ఘనతలు సాధ్యమయ్యేలా చేయాలి అంటూ ఆస్కార్‌ వేదికపై కీరవాణి భావోద్వేగానికి గురయ్యారు. ఇక చంద్రబోస్‌ ‘నమస్తే’ అంటూ తెలుగులో చెప్పారు. నాటు నాటు పాటను అనౌన్స్‌ చేయగానే రాజమౌళి, ఆయన భార్య రమా సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. ‘నాటునాటు’ పాట రిచ్‌ నెస్‌కు కారణం రమా అని రాజమౌళి కొనియాడారు. ఈ పాటకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.