నవతెలంగాణ – నెల్లికుదురు
విష జ్వరాలతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేటి పరిస్థితుల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజాప్రందా జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రజా పందా తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో హైదరాబాద్ లో ఈనెల 22న చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ మంగళవారం నిర్వహించారు గ్రామాలలో పారిశుద్ధ్య పనుల నిర్లక్ష్యం వల్ల దోమలు, ఈగలు,కలుషిత త్రాగనీరు తో గ్రామాలలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆయన అన్నారు. అన్ని రకాల పరీక్షలు ఆయా గ్రామాలలోని నిర్వహించి ప్రజలను డెంగ్యూ టైఫాయిడ్ అలాంటి విష జ్వరాల బారిన పడకుండా కాపాడాలని కోరారు.వైద్య,ఆరోగ్యశాఖ లలో పెద్ద ఎత్తున ఖాళీ పోస్టులు ఉన్నాయని,డాక్టర్స్ క్వాలిఫై వైద్య సిబ్బంది కొరత అన్ని పరీక్షలు నిర్వహించే పరికరాలు అందుబాటులో లేవని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అనవసర టెస్టులు చేస్తూ అధిక మోతాదు మందులు రాస్తూ ఉంటే డ్రగ్స్ అధికారులు దొంగ నిద్ర నటిస్తూన్నారని ఆవేదన వ్యక్తం చెందినట్లు తెలిపాడు. గత 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో రేషన్ కార్డు లేక పేద సామాన్య మద్దతు ప్రజానీకం ప్రభుత్వ సంక్షేమ సబ్సిడీ పథకాలను అందుకోలేకపోతున్నారని అన్నారు.ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి స్థలం ఉన్నవారికి 10 లక్షల ప్రభుత్వ ప్రభుత్వ సహాయం అందించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను యుద్ధ ప్రాతిపదిక అమలు చేయాలని ఈనెల 22న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా 45 శాతం మంది రైతులు రకరకాల కోర్రి lలు కోతలు పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు బండపల్లి వెంకటేశ్వర్లు, జక్కుల యాకయ్య పల్లెల పాపారావు మండల నాయకులు ఈర్ల వెంకన్న రమేష్ తో పాటు బాలు రాము కిషన్ తదితరులు పాల్గొన్నారు.