డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పూర్ గ్రామంలో ఆరోగ్య మేళ కార్యక్రమాన్ని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేల్ వ్యాధుల పై గ్రామ ప్రజలు అవగాహన కల్పి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన ఎంఎల్ హెచ్ పి గంగాభవాని, ఎఎన్ఎం లు గొల్లపల్లి శైలజ, రజిత, ఆశ కార్యకర్తలు వనిత, అరుణ, సరితా పాల్గొన్నారు.