ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై వెళ్లిన ఎండి జాఫర్ అలీ హెచ్ఎం, వి శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, కే పద్మజ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, కే మదన్మోహన్ ఫిజికల్ డైరెక్టర్, బి సంధ్యారాణి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జి నరసింహులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, చంద్రమౌళి అనే ఉపాధ్యాయులకు శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోరంట్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పాలకుర్తి రోజా రాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీ సహజమని బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పాఠశాలకు ఎనలేని సేవలు చేశారని, మంచి ఫలితాలు తీసుకొచ్చారని వారి సేవలను కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేసే పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల నమోదు విషయంలో బాధ్యతగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. బదిలీపై వెళ్లిన నూతన పాఠశాలలో కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని అన్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించారు. అట్లాగే పాఠశాలకు వచ్చిన నూతన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలనిపించి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీవన్ లాల్, అక్బర్, పాపారావు, జైపాల్, భూక్య సక్రు, కోడూరి సమ్మయ్య, బానాల సుధాకర్, పిడి విజయ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.