కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెళ్లి రేంజ్ అడవులలో ఆదివారం తెలంగాణహైకోర్టు జడ్జి రాధారాణి కుటుంబ సమేతంగా పర్యటించారు. ముందుగా వారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జంగల్ సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లి అందాలను తిలకించారు. వారికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామని ఇంధన్ పల్లి ఎఫ్ ఆర్ వో కారం శ్రీనివాస్ తెలిపారు.