
నవతెలంగాణ – డిచ్ పల్లి
నూతన బాలికల వసతి గృహం, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేయాలని ఎన్ ఎస్ యుఐ యూనివర్సిటీ అధ్యక్షుడు బానోత్ సాగర్ నాయక్ అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు ను మార్యదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనివర్శిటీ లో నెలకొనిఉన్న పలు సమస్యలను వీసికి వివరించారు. ప్రస్తుతం ప్రధాన సమస్యలు నూతన బాలికల వసతి గృహం, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో పాటు తదితర సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. యూనివర్సిటీని అభివృద్ధి బాటలో నడిపించాలని తమవంతుగా పూర్తి సహకారం అందజేస్తుంటమని వివరించారు. అన్ని విషయాలు విన్న వైస్ ఛాన్సలర్ సానుకూలంగా స్పందించారని సాగర్ నాయక్ పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు భూక్యా హరీష్ ,మహేష్ ప్రధాన కార్యదర్శులు జనార్ధన్, నవీన్, శ్రీకాంత్, శివప్రసాద్, లక్ష్మణ్, యుగేందర్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.