అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం రూ.3 లక్షలు మేర నష్టం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
గురువారం ఉదయం 8గం.ల సమయంలో తిరుమలకుంటలో తాటాకు ఇల్లు దగ్ధమైంది. పొట్ట రంగారావు కు చెందిన ఇల్లు పూర్తిగా కాలి దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.3 లక్షల విలువైన సొత్తు నష్టపోయినట్లు బాధితుడు తెలిపారు. రూ.45 వేల రూపాయల నగదు,టీవీ,ప్రిజ్, మంచాలు,పర్నిచర్,భీరువా వంటి సామాన్లన్ని దగ్ధమయ్యాయి. రంగారావు కొత్తగూడెం వెళ్ళాడు.కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళారు. ఈ సమయంలో ప్రమాదం జరగటంతో కట్టుబట్టలతో బాధితులు మిగిలి పోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు చెపుతున్నారు.ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. రెవిన్యూ అధికారులు సంఘటనను నమోదు చేసుకొని తక్షణ సహాయం అందజేసారు.మంటలు వ్యాప్తి చెందిన వెంటనే గ్రామస్తులు అంతా స్పందించి ఇతర ఇళ్ళకు మంటలు వ్యాప్తి చెందకుండా నిలువరించడం తో పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది.