బారెగూడలో పాక్షికంగా ఇల్లు దగ్ధం

Adilabadనవతెలంగాణ-బెజ్జూరు
మండలంలోని బారేగూడ గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో పాక్షికంగా ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన తేలి బాపు పిచికారి చేసే స్ప్రేయర్‌లో పెట్రోల్‌ వస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పొయ్యిలోని నిప్పు పెట్రోల్‌ క్యానుకు అంటుకోవడంతో మంటలు చెలరేగి వ్యాపించాయి. దీంతో ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తేలి శంకరమ్మ చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రురాలిని చికిత్స కోసం కాగజ్‌నగర్‌ పట్టణానికి తరలించారు. మంటల్లో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులు మంటలర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.