నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్.యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు. ‘రాక్షసుడు, ఖిలాడీ’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం ఆయన ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. తమ సంస్థలో ఇంతకు ముందు ‘రాక్షసుడు, ఖిలాడీ’ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మరోసారి ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈసారి బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టనున్నారు. రమేష్‌వర్మతో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్ కొలాబరేషన్. ఇటీవల వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న రాఘవ లారెన్స్ ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం విశేషం. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది ఈ ప్రాజెక్ట్. అనౌన్స్‌మెంట్ పోస్టర్ మీద షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ ఇమేజ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జైట్‌మెంట్ వర్డ్స్ ప్రాజెక్టుకు ఇన్‌స్టంట్‌గా హైప్ పెంచుతున్నాయి. ఇప్పటివరకు చూడని రీతిలో రాఘవ లారెన్స్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేసేందుకు దర్శకుడు రమేష్‌వర్మ రంగం సిద్ధం చేశారు. కథాకథనాల పరంగా ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతినివ్వడం ఖాయం అని మేకర్స్ అంటున్నారు. టాక్ ఆఫ్ ది ఇండిస్టీగా మారిన ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్.