– మెరిసిన తన్మయ్, రోహిత్, హిమతేజ
నవతెలంగాణ, హైదరాబాద్ : పుదుచ్చేరితో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (173, 328 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కగా.. అభిరాత్ రెడ్డి (68), రోహిత్ రాయుడు (84), హిమతేజ (60), తనరు త్యాగరాజన్ (53) అర్థ సెంచరీలతో మెరిశారు. 163 ఓవర్లలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 536/8 వికెట్లకు డిక్లరేషన్ ప్రకటించింది. 3.29 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన హైదరాబాద్ మరోసారి బ్యాట్ పట్టాల్సిన అవసరం లేకుండా భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ఇచ్చింది. రెండో రోజు ఆఖర్లో 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 24/2తో ఎదురీదుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరి 512 పరుగుల వెనుకంజలో నిలిచింది. పుదుచ్చేరి బ్యాటర్లు గౌరవ్ యాదవ్ (0), ఆకాశ్ (1) అజేయంగా ఆడుతున్నారు.