మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కి భారీ షాక్

– కాంగ్రెస్ పార్టీ నుండి 300 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
– బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరిక
– తెలంగాణ సాధించింది, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ
– పాల్వాయి స్రవంతి
నవతెలంగాణ- నాంపల్లి:
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాంపల్లి మండలంలోని గట్లమల్లేపల్లి, మహమ్మదాపురం, చిట్టెంపహాడ్, రేఖ్యా తండా, నామనాయక్ తండ, వడ్డేపల్లి, చల్లవాని కుంట, పెద్దాపురం, దామెర, నాంపల్లి గ్రామాల నుంచి సుమారు 300 మందికిపైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు  నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి సంజీవ తో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, నాంపల్లి మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి చండూరు మండలం ఇడికూడా గ్రామంలో బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి నివాసానికి చేరుకొని ఆమె సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి ప్రతి ఒక్కరికి గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న తనకు 2018 ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్  పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పార్టీ ఆదేశాలకు కట్టుబడి కష్టపడి పనిచేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండా ఏ ఒక్కరోజు కూడా గ్రామాలలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోకుండా తన స్వలాభం కోసం కాంట్రాక్టుల కోసం, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, చచ్చిపోయిన శవం ఎలా బ్రతుకుతుంది అని కాంగ్రెస్ పార్టీని అవమానించి 2018 ఎన్నికలలో గెలిపించిన  మునుగోడు ప్రజలను, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి 18 వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి అమ్ముడుపోయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు సృష్టించి బీజేపీ నుండి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలవేళ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీని నమ్ముకుని ఉన్న వారిని ఇబ్బందులకు గురి  చేయడం వల్లనే అందరూ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. తెలంగాణ సాధించింది బీఆర్ఎస్ పార్టీ నేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ఓటమి తప్పదని అన్నారు.
బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరిక
నాంపల్లి మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఎదుళ్ళ పృథ్వీరాజ్ బి ఎస్ పి పార్టీ కి రాజీనామా చేసి కార్యకర్తలతో కలిసి సోమవారం బీఆర్ఎస్  నాయకులు పాల్వాయి స్రవంతి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది నక్క రవీందర్, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి, ఇట్టం వెంకటరెడ్డి, గట్ల మల్లేపల్లి సర్పంచ్ నాగులవంచ శ్రీలత, నాంపల్లి మాజీ ఎంపీటీసీ కోరె ప్రమీల మురళి, అలుగువెల్లి జైపాల్ రెడ్డి, కోరే కిషన్, బెళ్లి సత్తయ్య, రాజశేఖర్ రెడ్డి, గౌరు కిరణ్, గంజి సంజీవ తదితరులు పాల్గొన్నారు.