బీఆర్ఎస్ కు భారీ షాక్, కాంగ్రెస్ పార్టీలోనికి భారీగా వలసలు

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ఫ
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని కంటయపాలెం పోలేపల్లి గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బూతులెవల్ నుండి పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు చేరవేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికునుల పని చేయాలని అన్నారు కంటాయపాలెం గ్రామానికి చెందిన సుమారు 70 మంది పోలేపల్లి గ్రామానికి చెందిన మరికొంతమంది చేరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, గ్రామ ఇంఛార్జి కొండెం ఉపేందర్ రెడ్డి, ఎడ్ల వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మొకటి వెంకన్న,వార్డ్ మెంబర్ ఉపేందర్, మందపురి శ్రీధర్, మంధపురి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.