పాలకుర్తిలో బీఆర్ఎస్ కు భారీ విజయం ఖాయం 

– ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య
నవతెలంగాణ -పెద్దవంగర: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై బీఆర్ఎస్ పార్టీకి భారీ విజయం ఖాయమని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. సోమవారం చిట్యాల గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం ఎంపీపీ ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపదలో అండగా నిలిచారని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల రూపురేఖలను మార్చిన ఘనత ఎర్రబెల్లి కే దక్కుతుందన్నారు. మీ ఇంటి ముందే అభివృద్ధి కనబడుతుందని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.