నవతెలంగాణ – కొనరావుపేట
ఈదురు గాలుల బీభత్సంతో మండల కేంద్రంలోని వైన్స్ పైన ఉన్న రేకులు షెడ్డు పడి ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా ఈదురు గాలుల బీభత్సంతో మండల కేంద్రంలోని వైన్స్ పైన ఉన్న రేకులు షెడ్డు పడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమన్. శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న కొనరావుపేట ఎస్సై ఆంజనేయులు వారిని పోలీసు వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అప్పటికే ఆ వ్యక్తులు ఉండగా ఆయన త్వరగా తీసుకెళ్లడం వలన వారికి ఎలాంటి ప్రాణ అపాయం కలగలేదని డాక్టర్లు తెలిపారు. మానవత్వంతో తన వాహనంలో తీసుకపోయిన ఎస్ఐని పలువురు మండల ప్రజలు అభినందించారు.