హాస్యభరిత వ్యంగ్య చిత్రం

హాస్యభరిత వ్యంగ్య చిత్రంచిరంజీవి, బాలయ్య, అమితాబ్‌, రజని, సచిన్‌, ధోని లాంటి వాళ్ళకు అభిమానులు ఉండటం అత్యంత సహజం. కానీ అంబానీ లాంటి వారికి అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అభిమానుల్లో ఒకడు శివ. 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి వీర అభిమాని. ఉద్యోగం, వ్యవసాయం కాకుండా వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదష్టానికో, దురదష్టానికో ఉన్న ఉళ్లోనే ఇతనికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. ఈలోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ ఏ నిచ్చెనలెక్కి, ఏ చుక్కలనందుకున్నాడో చెప్పే హాస్య భరిత వ్యంగ్య చిత్రం ‘పైలం పిలగా!’ అని మేకర్స్‌ చెబుతున్నారు. విలువ లేని వ్యవసాయం చేయలేక, వలస పోయి కార్పొరేట్‌ బానిస అవలేక ఉన్న ఊళ్ళోనే ఎంట్రప్రెన్యూర్‌గా మారి పది మందికి పని కల్పించి, అంబానీలా కోట్లు సంపాదించాలని అత్యుత్సాహంతో కలలు కన్నా ఓ మధ్యతరగతి యువకుడు, పద్మవ్యూహం వంటి బ్యూరోక్రసీ వ్యవస్థలో సమస్త అవస్థలు పడుతూ ఏ ప్రస్థానం చేరుకున్నాడో చెప్పే ఈ చిత్రం అందరీ ఆలోచించేలా ఉంటుందంటున్నారు. హ్యాపీ హార్స్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో రామకష్ణ బొద్దుల, ఎస్‌.కె. శ్రీనివాస్‌ నిర్మాతలుగా ఆనంద్‌ గుర్రం దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్ర పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల విజయవాడలోని కెఎల్‌ యూనివర్సిటీలో జరిగిన రామ్‌ మిర్యాల మ్యూజిక్‌ కన్సర్ట్‌లో విద్యార్థులుతో లాంచ్‌ చేయించారు. ఇన్నోవేటివ్‌గా, ఫన్నీగా ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌ విద్యార్థుల్లో అమితాకసక్తిని రేపింది. ‘పిల్ల పిలగాడు’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ సాయి తేజ హీరోగా, ‘పుష్ప’ ఫేమ్‌ పావని కారణం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో డబ్బింగ్‌ జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్‌ తదితరులు నటించారు. చౌరస్తా యశ్వంత్‌ నాగ్‌ మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రంలో ఆరు పాటలను రామ్‌ మిర్యాల, చిత్ర, శ్రావణి భార్గవి ఆలపించారు. ఈ చిత్రానికి కెమెరా: సందీప్‌ బద్దుల, ఎడిటింగ్‌ : రవితేజ కూర్మన, స్టైలిష్‌ : హారిక పొట్ట, లిరిక్స్‌ : ఆనంద్‌ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జుక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : సంతోష్‌ వాడ్నలా, సహ నిర్మాతలు : కష్ణమసునూరి, రవి వాషింగ్టన్‌, విజరు గోపు.