వంద పడకల హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలి.

– సరిపడా డాక్టర్లు సిబ్బందిని నియమించాలి 
– అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలి 
– ఐద్వా వైరా పట్టణ కమిటీ డిమాండ్
– స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో ఐద్వా సర్వే.
నవతెలంగాణ-వైరాటౌన్

వైరా నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ వేంటనే ప్రారంభించాలని, ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందించాలని, సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని, అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని ఐద్వా వైరా పట్టణ అద్యక్ష, కార్యదర్శులు మచ్చా మణి, గుడిమెట్ల రజిత డిమాండ్ చేశారు. మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు సర్వే చేశారు. డాక్టర్ తాతా ఉదయభాను, ఆయుష్ డాక్టర్ డి.జ్ఞానలత, సిబ్బంది, పేషెంట్లు తో మాట్లాడి హాస్పిటల్ లో అందిస్తున్న వైద్య సేవలు,  వైద్య పరీక్షలు, సౌకర్యాలు, మందుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా మచ్చా మణి, గుడిమెట్ల రజిత మాట్లాడుతూ హాస్పిటల్ లో ఇద్దరు డాక్టర్లు, 35 మంది స్టాప్ పనిచేస్తున్నారని, విరిలో మహిళా సిబ్బంది 30 మంది ఉన్నారని తెలిపారు. వర్షాకాలంలో హాస్పిటల్లో మందుల కోరత ఎక్కువగా ఉందని, సీజనల్ వ్యాదులు, విషజ్వరాలకు కావాల్సిన అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. మహిళా సిబ్బందికి బాత్ రూమ్స్ కూడా సక్రమంగా లేవని వెంటనే బాత్ రూమ్స్ ఎర్పాటు చేయాలని, హాస్పిటల్ కు వాచ్ మెన్ లేడని వేంటనే వాచ్ మెన్ ను నియమించాలని,  4 గురు చేయాల్సిన పనిని 30 సంవంత్సరాల నుండి ఒక మహిళా సిబ్బందితో చేయిస్తున్నారని, వెంటనే ఎమ్.ఎమ్ పోస్ట్ ను నియమించాలని, ఆశా వర్కర్లకు ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని, టి.బి కేసులను చూసినప్పుడు, ఓ.టిలు చేసినప్పుడు అధనపు జీతం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు భీమా సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి పించన్  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ సూపర్ డెంట్ బి.సునీత, హేడ్ నర్సులు ఏ.రాధ, కృష్ణకుమారి, కే.ఏమిలియా మేరి, ఆశావర్కర్లు మహేశ్వరి, రేణుక, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు