నవతెలంగాణ-హైదరాబాద్
దెయ్యం పట్టిందని భార్యను భర్త కిరాతకంగా కొట్టి చంపిన ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలు మండలం శివకోటి గ్రామంలో బళ్ళవాణి మనీషాను తన భర్త విజరు కుమార్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. మనీషా, విజరుకుమార్‌లకు చాలా కాలం క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు విజరుకుమార్ సరిగా తిండి కూడా పెట్టేవాడు కాదని మతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆయన చెప్పాడు. తన భార్యకు దెయ్యం పట్టిందనే నెపంతో భర్త మెడపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయిందని చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమె ప్రాణాలు విడిచింది. మతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మనీషా మతదేహం పక్కనే తమ తల్లి చనిపోయిందని కూడా తెలియని చిన్నారులు పడుకుని ఉండడం అక్కడివారిని కలచివేసింది.