– బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి వడిగట్టారు. వారాంతపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ జవాన్‌ను ఆదివారం ఉదయం మావోయిస్టులు గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి హతమార్చారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సీఏఎఫ్ కంపెనీ కమాండర్ తేజరామ్ భూర్య కుట్ర పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే జవాన్లపై దాడి చేయడమే కాక, ఒక జవాన్‌ను అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారని ఎస్పీ తెలిపారు. కాగా, ఘటన అనంతరం పోలీసులు అడవిని జల్లెడపడుతున్నారు.