అక్రమ మొర్రం తరలిస్తున్న ఒక జేసీబీ, ఏడు ట్రాక్టర్లు సీజ్

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని బ్రాహ్మణ చెరువులో నుంచి అక్రమ మొరాన్ని తరలిస్తున్న ఒక జేసిబీ, ఏడు ట్రాక్టర్లను ట్రాన్స్ పోర్స్, పోలీసు అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. మొరం తవ్వకాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, మండల పోలీసుల అధ్వర్యంలో అక్రమ మొరం తవకలపై దాడి నిర్వహించి ఒక జేసీ బీ, ఎడి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ దాడుల్లో ట్రాన్స్ పోర్స్ అధికారులు, మందలనూలిసులు ఉన్నారు.