– డీజీపీకి ఆప్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాలోతు సురేష్‌ను తొర్రూరు సీఐ చితబాదిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ నేతత్వంలో నాయకులు శుక్రవారం డీజీపీ డాక్టర్ జితేందర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా సదరు సీఐ సెల్‌ఫోన్ కూడా లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్, మహమ్మద్ మాజీద్ తదితరులున్నారు.