రసవత్తరంగా ఇరానీ పోరు

రసవత్తరంగా ఇరానీ పోరు– ముంబయి ప్రస్తుత ఆధిక్యం 274 పరుగులు
లక్నో (ఉత్తరప్రదేశ్‌) : ఇరానీ కప్‌ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. ముంబయి, రెస్టాఫ్‌ ఇండియా బ్యాటర్లు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగటంతో నాలుగు రోజుల ఆట ముగిసినా.. విజయం కోసం ఇరు జట్లు ప్రయత్నం చేస్తున్నాయి. రెస్టాఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్‌ (191, 292 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌), ధ్రువ్‌ జురెల్‌ (93, 121 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో 153/6తో ఆడుతోంది. పృథ్వీ షా (76, 105 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీ సాధించగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఆయుశ్‌ (14), హార్దిక్‌ తామోరె (7), అజింక్య రహానె (9), శ్రేయస్‌ అయ్యర్‌ (8), శామ్స్‌ ములానీ (0) తేలిపోయారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (9 నాటౌట్‌), తనుశ్‌ కొటియన్‌ (20 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్‌ జైన్‌ (4/67) నాలుగు వికెట్ల ప్రదర్శనతో విజృంభించగా.. మానవ్‌ (2/40) రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లు స్టార్‌ బౌలర్లు ముకేశ్‌ కుమార్‌, ప్రసిద్‌ కృష్ణలకు వికెట్లు దక్కలేదు. ముంబయి ప్రస్తుతం 274 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబయి డిక్లరేషన్‌తో రెస్టాఫ్‌ ఇండియాను ఛేదనకు ఆహ్వానిస్తే ఆఖరు రోజు ఆట రక్తికట్టనుంది.