రామ్ చరణ్ నయా సినిమా (ఆర్‌సి16) షూటింగ్ ఇటీవల మైసూర్‌లో ప్రారంభమైంది. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. శివరాజ్‌కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు కూడా ఇందులో కీలక పాత్రలో అలరించబోతున్నట్టు శనివారం చిత్ర బృందం తెలిపింది. ‘మీర్జాపూర్’లో మున్నా భయ్యా పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. జగపతి బాబు సైతం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈచిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.