ఇషా క్రియేషన్స్ పతాకంపై లల్లీ మధుమిత నటించి, నిర్మించిన చిత్రం ‘హతవిధి’. ‘అఫెండర్’ అనేది ట్యాగ్ లైన్. రాహుల్ జి గౌలికర్ దర్శకత్వంలో విభిన్న కథ-కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. లల్లీ మధుమిత – హరినాథ్ హీరో, హీరోయిన్లుగా, సుమన్, భానుచందర్, ఆమని, సమీర్, దేవీప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. నిర్మాతలు సాయి వెంకట్, టి. రామసత్యనారాయణ, తెలంగాణ బి.సి. కమీషన్ మాజీ చైర్మన్ వి.కష్ణమోహన్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లల్లీ మధుమిత మాట్లాడుతూ,’ఎన్నో భారీ వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం మా ఫస్ట్‌లుక్ మాదిరిగానే అద్భుతంగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’ అని తెలిపారు. ‘నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి పనిచేయడం వల్లే సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు రాహుల్ జి గౌలికర్ అన్నారు.