ఆద్యంతం నవ్వించే చారి..

ఆద్యంతం నవ్వించే చారి..చారి… బ్రహ్మచారి… రుద్రనేత్ర సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌. సైలెంట్‌గా హ్యాండిల్‌ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్‌ చేయడం అతని నైజం. అతడిని ‘ఏజెంట్‌ 111’ అని పిలుస్తారు. ‘బాండ్‌… జేమ్స్‌ బాండ్‌’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి’ అని పరిచయం చేసుకోవడం చారికి అలవాటు. ఒక సీరియస్‌ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు అతడు. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూడాలి. ‘వెన్నెల’ కిశోర్‌ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌. టీజీ కీర్తి కుమార్‌ దర్శకుడు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమేనని, సినిమాలో దీనికి మరింత వినోదం ఉంటుందని దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌, నిర్మాత అదితి సోనీ తెలిపారు. ప్రేక్షకుల్ని ‘చారి 111’ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదల కానున్నాయి. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్‌ రవీంద్రన్‌, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.