అధికారులను సన్మానించిన న్యాయవాది

A lawyer who honored the authoritiesనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలో ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షానికి మండల అధికారులు ఎమ్మార్వో శివప్రసాద్, ఎస్సై సాయికుమార్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు బాధితులను ప్రాణాలను పణంగా పెట్టి రక్షించడం, బాధితులకు పునరావాసం, భోజన వసతి సౌకర్యాలు, వర్షంలోనూ ప్రజల కోసం పనిచేయడానికి గుర్తించిన పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది రాజబాబు గౌడ్ బుధవారం శాలువాతో అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.