అన్ని కులాలకు సమన్యాయం చేసే నాయకుడిని గెలిపించుకోవాలి..

నవతెలంగాణ-తొగుట
అన్ని కులాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే  నాయకుడిని గెలిపించుకోవాలని కురుమ, యాదవ, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు అన్నారు. మంగళవారం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలోని కురుమ, యాదవ, ముది రాజ్ సంఘాలతో సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావే శంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథ కాలు పై చర్చించారు. అనంతరం సర్పంచ్ మాట్లా డుతూ కెసిఆర్ గజ్వేల్ నియోజవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రతి ఒక్క కుల సంఘానికి తగి న ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కురుమ, యాదవ సంఘానికి గొర్ల పెంపకం పై ఎన్నో సబ్సిడీలు ఇచ్చి సంఘాలకు ఆదుకున్నాడన్నారు.కులం ఓట్ల తో విడగొడుతు కుల రాజకీయం చేసే నాయకు లను ఎప్పటికీ నమ్మరాదని అన్ని కులాలను కంటి కి రెప్పలాగా చూసుకునే నాయకుడిని గెలిపించు కోవాల సూచించారు.కెసిఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్క కులానికి సంక్షేమ పథకాలందయని మచ్చ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి చెరువు,వాగులలో చేప పిల్లలను పెంచి జీవన ఉపాధిని కల్పించాని అన్నారు.మరొకసారి బీసీ కుటుంబీకులు కలిసి కెసిఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మూడో సారి ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత మనందరి పైన ఉందన్నారు.అనంతరం యాదవ,ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి సర్పంచ్  ఏకగ్రీవ తీర్మానం అందించారు.