రెంజల్ మండల కేంద్రంలో చురుకుగా కొనసాగుతున్న గ్రంథాలయ భవనం..

నవతెలంగాణ – రెంజల్ 

మండల కేంద్రమైన రెంజల్ లో గ్రంథాలయ భవన నిర్మాణం చురుకుగా కొనసాగుతోంది. గతంలో శిథిలవస్థలో ఉన్న భవనాన్ని తొలగించి అదే స్థలంలో నూతన భవనానికి శ్రీకారం చుట్టారు. సుమారు 32 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దండాలయాన్ని మండల పరిషత్ కాంప్లెక్స్ లో కొనసాగుతోంది…